చిరు.. నువ్వు మళ్లీ తిరిగి రా..!
close
Updated : 14/06/2020 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు.. నువ్వు మళ్లీ తిరిగి రా..!

నీవు లేకుండా నేను ఉండలేను: ధ్రువ సర్జా

బెంగళూరు: తన సోదరుడు చిరంజీవి సర్జా లేకుండా తాను జీవించలేకపోతున్నానని నటుడు ధ్రువ సర్జా అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా పలు పోస్ట్‌లు పెట్టారు. ఇటీవల చిరంజీవి సర్జా గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ధ్రువ తన సోదరుడిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో భావోద్వేగ పోస్ట్‌లు పెట్టారు. తన అన్నతో దిగిన పలు ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘నా అన్న.. నా ప్రపంచం.. నువ్వు మళ్లీ తిరిగి రా..! నువ్వు లేకుండా నేను జీవించలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. ధ్రువ పెట్టిన పోస్ట్‌లు చూసిన నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. ధ్రువ కంటే చిరంజీవి ఎనిమిదేళ్లు పెద్దవాడు. పేరుకి అన్నదమ్ములే అయినా స్నేహితుల్లా కలిసి ఉండేవాళ్లు. తన సోదరుడు ధ్రువతో దిగిన ఫొటోలను, వీడియోలను తరచూ చిరు ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేసేవారు. అయితే ఇటీవల చిరు మృతితో సదరు వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

2012లో విడుదలైన ‘అద్దూరి’ చిత్రంతో ధ్రువ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. నటుడిగా మొదటి సినిమానే ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత ‘బహద్దూర్‌’, ‘భర్జారి’ చిత్రాల్లో నటించారు. ఇటీవల ధ్రువ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పొగరు’. నంద కిషోర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించారు. మార్చి 24న ‘పొగరు’ విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని