‘ప్రాణమే.. నా ప్రాణమే..’ అంటోన్న కీర్తి సురేశ్‌
close
Published : 17/06/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రాణమే.. నా ప్రాణమే..’ అంటోన్న కీర్తి సురేశ్‌

‘పెంగ్విన్‌’ తొలి పాట విన్నారా?

హైదరాబాద్‌: ‘ప్రాణమే.. నా ప్రాణమే.. మరల వచ్చిందమ్మా..’ అంటున్నారు కీర్తి సురేశ్‌. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పెంగ్విన్‌’. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయన్‌ సంతానం, సుధన్‌ సుందరం, జయరాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. ‘ప్రాణమే..’ అని సాగే ఈ గీతాన్ని కీర్తి సురేశ్‌పై చిత్రీకరించారు. అపహరణకు గురైన తన కుమారుడు అజయ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమె పడే బాధను ఇందులో చూపించారు. వెన్నెల కంటి ఈ పాటకు సాహిత్యం అందించారు. సుషా ఆలపించారు. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు సమకూర్చారు.

గత ఏడాది ‘మన్మథుడు 2’లో అతిథి పాత్రలో కనిపించిన కీర్తి సురేశ్‌ ఆపై ‘పెంగ్విన్‌’లో నటించారు. జూన్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మరోపక్క ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘మిస్‌ ఇండియా’ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాలు ప్రొడక్షన్‌ పరంగా వివిధ దశల్లో ఉన్నాయి.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని