పారితోషికం తగ్గించుకుంటున్న కీర్తి
close
Updated : 17/06/2020 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారితోషికం తగ్గించుకుంటున్న కీర్తి

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వల్ల అన్ని రంగాలతోపాటు చిత్ర పరిశ్రమ కూడా నష్టపోయింది. అనేక సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. అంతేకాదు చిత్ర విడుదల తేదీల్లోనూ మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. థియేటర్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని నేపథ్యంలో చిన్న బడ్జెట్‌ సినిమాల్ని నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘అమృతరామమ్‌’, ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’, ‘గులాబో సితాబో’ విడుదలయ్యాయి. నిర్మాతలపై పడ్డ భారాన్ని తగ్గించడానికి పలువురు నటీనటులు పారితోషికం తగ్గించుకున్నారు. మిగిలిన వారు కూడా కొంత శాతం పారితోషికం తగ్గించుకుని.. నిర్మాతలకు చేయూతగా ఉండాలని కోరారు.

ఈ కోవలోనే కథానాయిక కీర్తి సురేశ్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలకు సాయంగా ఉండేందుకు ఆమె ముందుకు వచ్చారు. ముందుగా మాట్లాడుకున్న పారితోషికం నుంచి 20-30 శాతం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. కీర్తి సురేశ్‌ నటించిన ‘పెంగ్విన్‌’ సినిమా మరో మూడు రోజుల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘మరక్కర్’, ‘అన్నాత్తే’ ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని