మహేశ్‌ ‘సర్కారు వారి పాట’: కథానాయిక ఫిక్స్‌
close
Published : 19/06/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ ‘సర్కారు వారి పాట’: కథానాయిక ఫిక్స్‌

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మహేశ్‌బాబు మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవిపోగుతో మెడపై రూపాయి టాటూతో కనిపించారు. కాగా, ఈ సినిమాలో మహేశ్‌ సరసన ఎవరు నటిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తిసురేశ్‌ నటించనున్నారు. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇక మహేశ్‌ మెడపై రూపాయి టాటూ వెనుక ఆసక్తికర కథ ఒకటి సామాజిక మాధ్యమాల్లోనూ, టాలీవుడ్‌లోనూ చక్కర్లు కొడుతోంది. పరుశురామ్‌ ఈ కథను తొలుత అమెరికా నేపథ్యంలో రాసుకున్నారట. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి షూటింగ్‌ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఆ నేపథ్యాన్ని ఇండియాకు మార్చారని టాక్‌. దాంతో డాలర్‌ సింబల్‌తో మెడపై టాటూ వేయాల్సి ఉండగా, దాన్ని రూపాయి టాటూగా మార్చారట‌. అంతేకాదు, మహేశ్‌ చెవికి ఉన్న పోగు, రఫ్‌ లుక్‌ చూస్తుంటే ఇందులో ఆయన పాత్ర ‘పోకిరి’ సినిమాలోని పాత్ర లక్షణాలు ఉంటాయని అంటున్నారు.

ఇటీవల మహేశ్‌ తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా మాట్లాడుతూ.. ‘‘సర్కారు వారి పాట’ బలమైన సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్‌. నిజంగా ఈ సినిమా విషయంలో ఉత్సుకతగా ఉన్నా’’ అని అన్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఇందులో మహేశ్‌ ఎలా కనిపిస్తారు? ఆయన పాత్ర ఎలా ఉంటుంది? ఇతర నటీనటులు ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.  మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని