లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: హీరో ఎంత మారాడో..!
close
Published : 20/06/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: హీరో ఎంత మారాడో..!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలాన్ని సినీ తారలు చక్కగా ఉపయోగించుకున్నారు. సమంత వ్యవసాయం, వంట నేర్చుకున్నారు.. తమన్నా ఆవకాయ చేశారు. రాధికా ఆప్టే సొంతంగా సినిమా కథలు రాశారు. ఇంకొంత మంది సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేశారు. అదేవిధంగా యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ లాక్‌డౌన్‌లో 12 కిలోల బరువు తగ్గారు. ఆయన గత ఏడాది ‘నిను వీడని నీడను నేనే’, ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటి తర్వాత ‘A1 ఎక్స్‌ప్రెస్‌’లో నటిస్తున్నారు. ఇందులో సందీప్‌ హాకీ క్రీడాకారుడిగా దర్శనమివ్వబోతున్నారు. ఈ చిత్రం కోసం ఆయన సిక్స్‌ప్యాక్‌లో మరింత ఫిట్‌గా తయారయ్యారు. ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కుల్‌దీప్‌ శిక్షణ మేరకు కసరత్తులు చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను హీరో సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. #A1Express అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సందీప్‌ అంకితభావాన్ని, శ్రమించే తత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

‘A1 ఎక్స్‌ప్రెస్‌’లో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. డెన్నీస్‌ జీవన్‌ దర్శకుడు. మురళీ శర్మ, రావు రమేశ్‌, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు. మరోపక్క సందీప్‌ హీరోగా ‘నరగాసురన్’, ‘కన్నాడి’, ‘కశడ థపార్‌’ అనే తమిళ సినిమాలు రూపొందనున్నాయి. ఇవన్నీ ప్రొడక్షన్‌ పరంగా వివిధ దశల్లో ఉన్నాయి.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని