ఆడుకుంటూ సమంత.. వంట చేస్తూ పూజ..
close
Published : 21/06/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆడుకుంటూ సమంత.. వంట చేస్తూ పూజ..

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కాలాన్ని సినీ తారలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. సమంత మిద్దెపై వ్యవసాయం చేస్తూ, కొత్త రకాల వంటల గురించి తెలుసుకుంటున్నారు. తాజాగా ఆమె బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో  ఆడుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ఇన్‌స్టా వేదికగా కుక్కలతో ఆడుకుంటున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రెండు కుక్కలు ఆమెను చుట్టుముట్టగా సమంత నవ్వు ఆపుకోలేకపోయారు. అవి తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా చెప్పుకొచ్చారు.

ఇక పూజా హెగ్డే వంట చేసి భోజనం వడ్డించుకుంటున్న వీడియోను పంచుకున్నారు. ‘నిన్ను సంతోషంగా ఏ విషయం ఉంచుతుందో దాని గురించి అన్వేషించు. అన్ని విషయాల్లో మానసిక సంతృప్తి ఉండాలి. లాక్‌డౌన్‌ వేళ నా కుటుంబ సభ్యులకు వంట చేసి పెట్టడాన్ని నేను ఆస్వాదిస్తున్నా’ అని పూజా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారాయి. కావాలంటే వాటిని మీరూ చూడండి. 


 


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని