ఆ హీరో కోసం కీర్తి సురేశ్ ఏం చేశారో చూడండి!
close
Published : 22/06/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరో కోసం కీర్తి సురేశ్ ఏం చేశారో చూడండి!

పాత క‌ళ‌ను బ‌య‌ట‌పెట్టిన ‘మ‌హాన‌టి’

చెన్నై: క‌థానాయిక కీర్తి సురేశ్ లాక్‌డౌన్‌లో త‌న పాత క‌ళ‌‌కు మెరుగుపెట్టే ప‌నిలో ప‌డ్డారు. త‌న‌కు వ‌యొలిన్ వాయించ‌డం తెలుస‌ని తాజాగా ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. ‘లాక్‌డౌన్ స‌మ‌యాన్ని.. నా పాత క‌ళ వ‌యొలిన్ వాయించ‌డాన్ని మెరుగుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా’ అని పేర్కొన్నారు. అంతేకాదు సోమ‌వారం అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘జీవితం చాలా చిన్న‌ది.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు విజ‌య్ స‌ర్. మీ బ‌ర్త్‌డేకి ఇది నా చిన్న కానుక’ అని పేర్కొన్నారు. ఇందులో ఆమె ‘మాస్ట‌ర్’ సినిమాలోని ‘కుట్టి స్టోరీ..’ పాట‌ను వ‌యొలిన్ ద్వారా వినిపించారు. ఆమెలో మంచి న‌టే కాకుండా.. సంగీత క‌ళాకారిణి ఉంద‌ని తెలుసుకున్న అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. మాంజిమా మోహ‌న్‌, ప్రియాంకా ద‌త్ త‌దిత‌రులు ఆశ్చ‌ర్య‌పోతూ కామెంట్లు చేశారు. కేవ‌లం గంట వ్య‌వ‌ధిలో దాదాపు 3 ల‌క్ష‌ల మంది వీడియోను వీక్షించారు.

కీర్తి సురేశ్ ఇటీవ‌ల ‘పెంగ్విన్’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందించిన ఈ సినిమాను ఈశ్వర్‌ కార్తీక్‌ తెర‌కెక్కించారు. ఇందులో కీర్తి ఆరేళ్ల బాబుకు త‌ల్లిగా న‌టించ‌డం విశేషం. అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన సినిమా మంచి టాక్ అందుకుంది. ప్ర‌స్తుతం ఆమె ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌ల‌క్ స‌ఖి’, ‘రంగ్‌దే’ చిత్రాల్లో న‌టిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని