బంధుప్రీతి ప్రతిచోటా ఉంది: రేణూ దేశాయ్‌
close
Published : 23/06/2020 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంధుప్రీతి ప్రతిచోటా ఉంది: రేణూ దేశాయ్‌

‘జీవితం అనుకున్నట్లే ఉండదు’

హైదరాబాద్‌: బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం.. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయని నటి రేణు దేశాయ్‌ పేర్కొన్నారు. ఆమె తాజా ఇంటర్వ్యూలో కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య గురించి మాట్లాడారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమకు వచ్చినప్పుడు నైపుణ్యంతోపాటు దృఢత్వం కూడా ఉండాలని పేర్కొన్నారు.

‘‘సుశాంత్ చాలా తెలివైన వాడు.. కానీ, సున్నితమైన వ్యక్తిత్వం. అతడు విజయాలు అందుకున్నాడు, స్టార్‌గా ఎదిగాడు. అందరూ బంధుప్రీతి వల్లే మానసిక ఒత్తిడికి గురయ్యాడని అంటున్నారు. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ బంధుప్రీతి ఉంది, అది మనందరికీ తెలుసు. సినీ కుటుంబం కానప్పుడు.. కేవలం నైపుణ్యం ఉంటే సరిపోదు. దాంతోపాటు బలంగా ఉండటం నేర్చుకోవాలి. ‘నన్ను నేను నిరూపించుకోవాలి’ అనే సంకల్పం ఏర్పరచుకోవాలి. మన ఇష్టం ప్రకారం కెరీర్‌ జరగదు.. దానికి దిగులుపడకూడదు. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు’’ అని ఆమె పేర్కొన్నారు.

రేణు నటిగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. టాలీవుడ్‌లో ఆసక్తికరమైన పాత్రలో నటించే అవకాశం వస్తే చేస్తానని ఇటీవల అన్నారు. ప్రస్తుతం ఆమె రైతుల జీవితాలు, వారి సమస్యలపై సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ‘అన్నదాత సుఖీభవ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కొన్నిరోజుల క్రితం రేణు పల్లెటూళ్లకు వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని గమనించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని