సమంత స్నేహితురాలికి కరోనా పాజిటివ్‌
close
Published : 23/06/2020 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత స్నేహితురాలికి కరోనా పాజిటివ్‌

ఇలా వైరస్‌ను అధిగమించండి.. వీడియో చూడండి

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత, ప్రముఖ డిజైనర్‌ శిల్పా రెడ్డి మంచి స్నేహితులు. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ ఒక్కచోట చేరుతుంటారు. సామ్‌ ముద్దుపెడుతున్న ఫొటోను శిల్ప కొన్ని రోజుల క్రితం సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. కాగా తనకు కరోనా సోకిందని, దాన్నుంచి కోలుకోగలిగానని తాజాగా శిల్ప వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. దీన్ని సామ్‌ ఫాలోవర్స్‌తో పంచుకుంటూ... దయచేసి చూడమని కోరారు.

‘కొన్ని వారాల క్రితం ఫ్యామిలీ ఫ్రెండ్‌ మా ఇంటికి వచ్చారు. అనారోగ్యంగా ఉందని వెళ్లిపోయారు. తర్వాత వాళ్ల కుటుంబంలోని వారికి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. దీంతో మా కుటుంబ సభ్యులమంతా పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నాం. నాకు, నా భర్తకు కరోనా ఉందని వైద్యులు తెలిపారు. కానీ మాకు ఎటువంటి లక్షణాలు లేవు. సరైన డైట్‌, కసరత్తులతో ఇద్దరం కరోనా బారి నుంచి బయటపడ్డాం’ అని శిల్పా వీడియోలో తెలిపారు. మరోపక్క సమంత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడానికి ముందు సామ్‌ని కలిశారా? అని శిల్పాను ప్రశ్నిస్తున్నారు. దీని గురించి ఆమె స్పందించలేదు.

ఇదే సందర్భంగా రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలో శిల్పా వివరించారు. వాటిని ఈ వీడియోలో మీరూ చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని