‘శివ’ జ్ఞాపకాలతో సంచలన డైరెక్టర్‌..!
close
Updated : 24/06/2020 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘శివ’ జ్ఞాపకాలతో సంచలన డైరెక్టర్‌..!

ఆర్జీవీ ఏం ట్వీట్‌ చేశారంటే..

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘శివ’ చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా మారారు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ చిత్రంతో దర్శకుడిగా ఆయన వేసిన తొలి అడుగులోనే మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నాగార్జునను మాస్‌ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసిన ‘శివ’ షూటింగ్‌ రోజుల్ని తాజాగా ఆర్జీవీ గుర్తు చేసుకున్నారు. షూటింగ్‌ సమయంలో రఘువరన్‌ (శివవిలన్‌)తో తీసుకున్న ఓ ఫొటోను ట్వీట్‌‌ చేశారు. ‘‘శివ’ చిత్రీకరణ సమయంలో రఘువరన్‌కు ఓ సన్నివేశాన్ని వివరిస్తున్న నేను’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆర్జీవి పెట్టిన ట్వీట్‌పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్‌.. మీ నుంచి ‘శివ’ తరహా చిత్రాలను ఆశిస్తున్నాం’ అని కామెంట్లు పెడుతున్నారు. 

స్టూడెంట్‌ గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ చిత్రంలో ‘శివ’ పాత్రలో నాగార్జున మెప్పించగా.. ప్రతినాయకుడు భవానీగా రఘువరన్‌ ఆకట్టుకున్నారు. అమల కథానాయికగా 1989లో విడుదలైన ఈ సినిమా ఆర్జీవీతోపాటు నాగార్జున కెరీర్‌లో సైతం ఓ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆర్జీవీ - నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ 2018లో విడుదలై మిశ్రమ స్పందనలుందుకున్న సంగతి తెలిసిందే.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని