సమంత-చైల నుంచి అదే నేర్చుకోవాలి!
close
Published : 02/07/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత-చైల నుంచి అదే నేర్చుకోవాలి!

హైదరాబాద్‌: సుశాంత్‌ కథానాయకుడిగా ఎస్‌.దర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం చిత్రీకరణ వాయిదా పడింది. తాజాగా సుశాంత్‌ తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ థ్రిల్లర్‌ సినిమా అని తెలిపారు. కథ ఎగ్జైటింగ్‌గా ఉంటే తెరపై ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించడం కూడా తనకు ఇష్టమేనన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ నిలిచి పోవడంతో ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  చిత్రీకరణ ప్రారంభించడానికి అందరిలాగే తానూ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నాగచైతన్య, సమంతలు చాలా క్రమశిక్షణగా ఉంటారని, వాళ్ల దగ్గర నుంచి అదే తాను నేర్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏఐ స్టూడియోస్‌ పతాకంపై రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కొయలగుండ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు స్వరాలు సమకూరుస్తున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని