జపాన్‌లో ‘వార్‌’?
close
Published : 04/07/2020 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జపాన్‌లో ‘వార్‌’?

ముంబయి: కరోనా ధాటికి ప్రపంచం విలవిలలాడిపోతుంది. ఆ ప్రభావం చిత్ర పరిశ్రమపై ఎక్కువగానే ఉంది. మనదేశంలో థియేటర్లు తెరచుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. కొన్ని దేశాల్లో థియేటర్లు తెరకున్నాయి. జపాన్‌లో మే నుంచే థియేటర్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే జపాన్‌లోని థియేటర్లలో పలు చిత్రాలు సందడి చేస్తున్నాయి.

భారతీయ చిత్రం ‘వార్‌’ను అక్కడ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అక్కడ ఈ ఇద్దరి హీరోలకు అభిమానులు ఉండటంతో ‘వార్‌’ను ఈ నెల 17న విడుదల చేసే అవకాశాలున్నట్టు సమాచారం. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ‘వార్‌’ ఇక్కడ మంచి విజయం సాధించింది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని