వరుణ్‌ ‘అంతరిక్షం’లో ఇలా షూట్‌ చేశారు
close
Published : 04/07/2020 23:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌ ‘అంతరిక్షం’లో ఇలా షూట్‌ చేశారు

హైదరాబాద్‌: వైవిధ్యమైన కథలను, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌. మెగా కుటుంబం నుంచి వచ్చినా వరుణ్‌ కథల ఎంపిక ప్రత్యేకం. గతేడాది ‘గద్దల కొండ గణేష్‌’లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించి మెప్పించారు. సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘అంతరిక్షం 9000కెఎంపీహెచ్‌’. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రం. అటు నటీనటులు, ఇటు సాంకేతిక బృందం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న వరుణ్‌తేజ్‌ ఆ సినిమాకు సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘అంతరిక్షం’ సెట్‌లో చిత్రీకరణకు సంబంధించిన వీడియోను పంచుకున్న ఆయన.. ‘నేను వేలాడుతున్నా.. కేవలం వేలాడుతున్నా’ అంటూ షేర్‌ చేశారు. అంతరిక్షం సన్నివేశాలను ఎలా తెరకెక్కించారో, సాంకేతిక బృందం ఎలా కష్టపడిందో.. ఈ వీడియోతో మనకు అర్థమవుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని