సుశాంత్‌సింగ్‌ సినిమా ట్రైలర్‌ విడుదల
close
Updated : 16/07/2020 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌సింగ్‌ సినిమా ట్రైలర్‌ విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమా ‘దిల్‌ బెచారా’ ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. సుశాంత్‌, నూతన నటి సంజన సంఘిల నటన హృదయాన్ని హత్తుకుంటోంది. సినిమా సైతం కంటతడి పెట్టించేలా ఉండబోతోందని ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. 2014లో హాలీవుడ్‌లో విడుదలైన రొమాంటిక్‌ డ్రామా ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ సినిమాకి రిమేక్‌గా దిల్‌ బెచారాను నిర్మించారు‌. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథ ఇది. సైఫ్‌ అలీ ఖాన్‌ సైతం ఈ చిత్రంలో నటించారు. ఏఆర్‌ రెహమాన్‌  సంగీతాన్ని అందించారు. మే నెలలోనే విడుదల కావాల్సిన దిల్‌ బెచారా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. కాగా ఈనెల 24వ తేదీన హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధమైంది. 

ట్రైలర్‌ విడుదల సందర్భంగా సినిమా డైరెక్టర్‌ ముకేష్‌ చబ్బా మాట్లాడుతూ..‘రెండేళ్ల  నిరీక్షణ అనంతరం సినిమాని విడుదల చేస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. హృదయానికి దగ్గరైన స్నేహబంధం లభించింది. నా చివరి శ్వాస వరకు నాతోపాటు ఉండే సుశాంత్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ దిల్‌ బెచారా విడుదలకు సిద్ధమైంది’ అని అన్నాడు. ట్రైలర్‌ని ట్విటర్‌లో పంచుకున్న సినిమా హీరోయిన్‌ సంజన ‘సుశాంత్‌.. మేమంతా నిన్నెంతో మిస్‌ అవుతున్నాం. నువ్వు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు’ అని పేర్కొంది.
 

 

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని