సల్మాన్‌ సినిమా పట్టాలెక్కేనా? 
close
Published : 07/07/2020 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌ సినిమా పట్టాలెక్కేనా? 

ముంబయి:కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే: ఇండియాస్‌ మోస్ట్ వాంటెడ్‌ భాయ్‌‌’.ప్రభుదేవా దర్శకత్వం వహించగా.. అట్లూరి అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర షూటింగ్‌ పూర్తి చేసినా.. లాక్‌డౌన్‌తో ఈ సినిమా చిత్రీకరణకు  బ్రేక్‌ పడింది. అయితే  ఆగస్టు నుంచి చిత్రీకరణను పునః ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. 

దీని కోసం ముంబయిలోని మహబూబ్‌ స్టూడియోస్‌లోని ఓ ఫ్లోర్‌ను ఇప్పటికే బుక్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మంది సిబ్బందితో షూటింగ్‌ నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో  ప్రారంభించి నెలాఖరుకల్లా  చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దీపావళి నాటికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చిన్నపాటి సన్నివేశాలు మినహా కథానాయకుడి పాత్ర చిత్రీకరణ చాలా వరకు పూర్తయినట్లు చిత్ర బృందం చెబుతోంది.  హీరోయిన్‌ దిశా పటానీ, సల్మాన్‌ఖాన్‌ల మధ్య ఇటీవల అజర్‌బైజాన్‌లో ఓ సాంగ్‌ను షూట్‌ చేయగా.. తాజాగా మహబూబ్‌ స్టూడియోలో మరోసాంగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని