సుశాంత్‌ను ఆ రహస్యాలు అడిగేదాన్ని: సుస్మితా సేన్‌
close
Published : 08/07/2020 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ను ఆ రహస్యాలు అడిగేదాన్ని: సుస్మితా సేన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చిత్రం ‘దిల్‌ బెచరా’ ట్రైలర్‌ చూసి సుస్మితా సేన్‌ చలించిపోయారు! అవకాశం దొరికితే ఈ విశ్వం రహస్యాలు, 47వ సంఖ్య అంటే తమ ఇద్దరికీ ఎందుకిష్టమో కనుగొనేవాళ్లమని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న సుశాంత్‌ అభిమానులను ఉద్దేశించి ఆమె ఓ సందేశం రాశారు.

‘వ్యక్తిగతంగా నాకు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌తో పరిచయం లేదు. సినిమాలు, ఇంటర్వ్యూల ద్వారా కొంత తెలుసుకున్నా!! ఆఫ్‌ స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌పైనా అతడు  భావోద్వేగాలు పలికించగలడు. ఇప్పుడు అతడి గురించి తెలుసనిపిస్తోంది. అతడి అభిమానులకు ధన్యవాదాలు. సింప్లిసిటీ, దయ, ప్రేమ, కరుణ, జీవితాంతం గుర్తుండిపోయే చిరునవ్వుతో అతడు ఎందరి జీవితాలనో స్పృశించాడు. ఒక నటుడిగానే కాదు మంచి మనిషిగా అతడికి మీలాంటి అభిమానులు దొరకడం అదృష్టం’ అని సుస్మితా సేన్‌ అన్నారు.

‘అతడి గురించి తెలుసుకొనే, కలిసి పనిచేసే అవకాశం వస్తుందని అనుకున్నా. అలా అయ్యుంటే మేం ఎక్కువగా విశ్వం రహస్యాల గురించి మాట్లాడుకునే వాళ్లం. బహుశా మాకిద్దరికీ 47వ నంబర్‌ అంటే ఎందుకిష్టమో కనుగొనేవాళ్లం. దిల్‌ బెచరా ట్రైలర్‌ బాగుంది. చిత్రబృందానికి అభినందనలు. సుశాంత్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు సంఘీభావం ప్రకటిస్తున్నా’ అని సుస్మితాసేన్‌ రాశారు. సోమవారం విడుదలైన ‘దిల్‌ బెచరా’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని