మహేశ్‌ చిత్రంలో కీర్తి సురేశ్‌ పాత్ర ఇదేనా?
close
Published : 08/07/2020 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ చిత్రంలో కీర్తి సురేశ్‌ పాత్ర ఇదేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందం, అభినయంతో తెలుగు చిత్రసీమను మెప్పించిన నటి కీర్తి సురేశ్‌. ‘మహానటి’ చిత్రంలో నటనతో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ పురస్కారం అందుకొని మరో స్థాయికి ఎదిగింది. పరశురామ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి బ్యాంకు అధికారిగా కనిపించబోతున్నారని సమాచారం.

‘గీత గోవిందం’తో జోరుమీదున్న దర్శకుడు పరశురామ్‌. ‘సరిలేరు నీకెవ్వరు’తో తిరుగులేని హిట్టుకొట్టారు మహేశ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్థిక, బ్యాంకు కుంభకోణాల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు చిత్రవర్గాల్లో టాక్‌ నడుస్తోంది. కరోనా వైరస్‌ పరిస్థితుల్లో నిలిచిపోయిన షూటింగ్‌ సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో మొదలవుతుందని తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ను నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక కీర్తి సురేశ్‌ ఖాతాలో మూడు తెలుగు సినిమాలు ఉండటం గమనార్హం. ఆమె నటించిన ‘మిస్‌ ఇండియా’ నిర్మాణం పూర్తైనట్టు తెలుస్తోంది. నితిన్‌కు జోడీగా ‘రంగ్‌ దె’,  నగేశ్‌ కుకునూర్‌ స్పోర్ట్స్‌ కామెడీ చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని