స్టూడియోలోనే సల్మాన్‌ ‘రాధే’ మిగతా షూటింగ్‌!
close
Published : 11/07/2020 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టూడియోలోనే సల్మాన్‌ ‘రాధే’ మిగతా షూటింగ్‌!

ముంబయి: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తోన్న ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచిచూస్తున్న చిత్రాల్లో ఒకటి.  ప్రభుదేవా దర్శకత్వంలో రణ్‌దీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా. దిశా పటానీ కథానాయిక. ఈద్‌ పండుగకే విడుదల చేయాలని తొలుత భావించినా కరోనా మహమ్మారితో షూటింగ్‌ పూర్తి కాలేదు. ఇంకా పది  నుంచి పన్నెండు రోజుల పని మిగిలిపోయింది. దీంతో మిగిలిన షూటింగ్‌ను స్టూడియోలోనే పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తుందని పలు కథనాలు పేర్కొన్నాయి. 

యాక్షన్‌ సీక్వెన్స్‌, ఒక పాటను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించాలని బృందం భావించినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చాయి. అయితే కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో షూటింగ్‌ నిలిచిపోయింది. దీంతో మిగతా భాగాన్ని స్టూడియోలోనే షూట్‌ చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఒకవేళ అక్టోబరు, నవంబరులో థియేటర్స్‌ ఓపెన్‌ అయితే దీపావళికి ‘రాధే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని