ఆ 400 కుటుంబాల బాధ్య‌త నాదే: సోనూసూద్
close
Published : 14/07/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 400 కుటుంబాల బాధ్య‌త నాదే: సోనూసూద్

చ‌నిపోయిన‌ వ‌ల‌సకార్మిక కుటుంబాల‌కు ఆర్థికసాయం

దిల్లీ: లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికుల‌కు బాస‌ట‌గా నిలిచిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ర‌ణించిన, గాయాల‌పాలైన దాదాపు 400 వ‌ల‌సకార్మిక‌ కుటుంబాల‌ను ఆర్థికంగా ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు. 'మృతిచెందిన వ‌ల‌స కార్మికుల కుటుంబాల‌ భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థికస‌హాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. వారికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం నా వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌గా భావిస్తున్నాను' అని సోనూసూద్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌ర‌ణించిన‌ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన‌ వ‌ల‌స కార్మికులకు ఆర్థికస‌హాయం చేసే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల అధికారుల నుంచి మ‌ర‌ణించిన వ‌ల‌స కార్మికుల అడ్ర‌స్‌, బ్యాంకు అకౌంట్ల వివ‌రాల‌ను సేక‌రిస్తున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని