చందనసీమలో ‘ఈడీ’ కలకలం
close
Updated : 11/09/2020 08:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చందనసీమలో ‘ఈడీ’ కలకలం

బెంగళూరు, యశ్వంతపుర : కర్ణాటక మాదక ద్రవ్యాల కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రవేశించారు. గురువారం ఉదయం బెంగళూరులోని కేంద్ర నేరనియంత్రణ దళం (సీసీబీ) కార్యాలయానికి ఈడీ సహాయ సంచాలకుడు బసవరాజ్‌ నేతృత్వంలోని అధికారులు చేరుకుని విచారణలో ఉన్న నిందితుల వివరాలను సేకరించారు. ఇప్పటికే పోలీసుల విచారణలో ఉన్న రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీ, పృథ్వీ శెట్టితో పాటు మాదకద్రవ్య సరఫరాదారులు (డ్రగ్స్‌ పెడ్లర్లు) వీరేన్‌ ఖన్నా, రాహుల్‌ ఆస్తుల గురించి వీరు ఆరా తీశారు. వారికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రాగిణి ద్వివేదీ కేపీఎల్‌ బళ్లారి టీమ్‌లో భాగస్వామి. పృథ్వీశెట్టితో కలిసి సంజనా బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఈడీ అధికారులకు సమాచారం అందింది. వీటికి తోడు ఈ కేసులో అరెస్ట్‌ అయిన నిందితులకు కేరళకు చెందిన బంగారు స్మగ్లర్‌ ముఠాతో సంబంధాలున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు- విచారణ కొనసాగించేందుకు కొచ్చి ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి కూడా పొందారు. వీరేన్‌ ఖన్నా ఇంటిని సోదా చేసిన సందర్భంగా 12 దేశాల కరెన్సీని గుర్తించారు. ఇక నుంచి ఈ కేసులో చిక్కుకున్న వారిని సీసీబీ, ఈడీ అధికారులు ఏకకాలంలో విచారించనున్నారు. సినీతారలు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదికి ఉన్న ఆస్తుల వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.

వంద మంది ఎవరు?

సీసీబీ విచారణలో సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ కన్నడ చలన చిత్ర రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖ సినీ నటిమణులు, పారిశ్రామికవేత్తలు, నగరానికి చెందిన ఇద్దరు శాసనసభ్యుల కుమారులు, వివిధ రంగాలకు చెందిన మొత్తం వంద మంది పేర్లను వెల్లడించినట్లు సమాచారం. వారందరికీ డ్రగ్స్‌ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు సేకరించడమే ఇప్పుడు అధికారుల పని. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని కొందరికీ నోటీసులు ఇస్తామని సీసీబీ అధికారులు తెలిపారు. రాగిణి, సంజనా ఇళ్లలో పని వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మత్తు పదార్థాలను తీసుకుంటున్నదీ.. లేనిదీ శాస్త్రీయంగా గుర్తించడానికి రాగిణి, సంజనా రక్తాన్ని సేకరించారు. బెంగళూరు కేసీజనరల్‌ ఆసుపత్రిలో గురువారం ఈ పరీక్షలు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని