జీవితాల్ని చూపించే.. ‘ఉప్పెన’   - పవన్‌ కల్యాణ్‌
close
Updated : 12/02/2021 05:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవితాల్ని చూపించే.. ‘ఉప్పెన’   - పవన్‌ కల్యాణ్‌

‘‘మన జీవితాల్ని.. అందులోని భావోద్వేగాల్ని.. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కథగా తెర మీదకు తీసుకొచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ‘ఉప్పెన’ ఆ కోవలోకి చేరుతుంద’’న్నారు కథానాయకుడు, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. ఆయన చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన తొలి చిత్రమిది. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. కృతిశెట్టి  నాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. తాజాగా పవన్‌ కల్యాణ్‌ ‘ఉప్పెన’ ట్రైలర్‌ వీక్షించి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘‘వైష్ణవ్‌ ‘జానీ’లో బాల నటుడిగా.. హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. తొలి అడుగులోనే సవాల్‌తో కూడిన పాత్రని ఎంచుకున్నాడు. బుచ్చిబాబు ఈ కథని సమర్థంగా తెర కెక్కించారని అర్థమవుతోంది. మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా’’ అన్నారు.
‘పవన్‌ 28’ అప్పుడే..
పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. జూన్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ చిత్రం పూర్తికాగానే జూన్‌లో మా సినిమా ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీనికి కథ సిద్ధమైంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని