close
Published : 23/02/2021 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యువతరాన్ని అలరించే ‘70ఎమ్‌.ఎమ్‌’

జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్‌.యస్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘70ఎమ్‌.ఎమ్‌’. రాజశేఖర్‌, ఖాసీం నిర్మించారు. అక్షత శ్రీనివాస్‌ నాయిక. ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిక అక్షత మాట్లాడుతూ.. ‘‘సినిమా పేరులోనే కథ ఉంది. అదేంటన్నది చిత్రం చూశాకే తెలుస్తుంది. కచ్చితంగా యువతరాన్ని   అలరిస్తుంది. నేనిందులో జేడీ.చక్రవర్తి భార్యగా కనిపిస్తా. చిత్రీకరణ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. అందరం ఎంతో ఇష్టపడి చేసిన చిత్రమిది. యాక్షన్‌, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం నేను ‘క్వశ్చన్‌ మార్క్‌’ (?)లో ఓ ముఖ్య పాత్రలో నటించా. సందీప్‌ మాధవ్‌ హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నా’’ అంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: అంజి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని