close
Published : 23/02/2021 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మైదానంలో ఆట.. బయట వేట

‘‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’’ అంటున్నారు గోపీచంద్‌. ఇప్పుడాయన నాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. భూమిక కీలక పాత్రలో నటించింది. ఏప్రిల్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. కబడ్డీ ఆట నేపథ్యంగా సాగే శక్తిమంతమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. గోపీచంద్‌, తమన్నా మహిళా కబడ్డీ టీం కోచ్‌లుగా కనిపించనున్నారు. టీజర్‌లో ‘రేయ్‌ కార్తి’ అంటూ రావు రమేష్‌ పిలవగానే.. ‘నన్నెవడైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి.. లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్‌ పిలవాలి’’ అని గోపీచంద్‌ బదులివ్వడం హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా రక్తం.. చెమట చిందించి ఎంతో కష్టపడి సినిమా తెరకెక్కించాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌ రాజన్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని