close
Published : 23/02/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంగీతపర్వం

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్‌ బొబ్బిలి స్వరాలందిస్తున్నారు. ఏప్రిల్‌ 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 25న ‘‘కోలు కోలు’’ అనే తొలి లిరికల్‌ గీతాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఓ కొత్త పోస్టర్‌ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రచార చిత్రంలో.. సాయిపల్లవి కాకతీయ తోరణం దగ్గర సంప్రదాయ నృత్యం చేస్తూ ఆకట్టుకునేలా కనిపించింది. ‘‘ఒక విభిన్నమైన  కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటి వరకు కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు’’ అని చిత్ర బృందం తెలియజేసింది.  కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: డానీ సాంచెజ్‌ లోపెజ్‌, దివాకర్‌ మణి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని