ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీపిక పదుకొణె కథానాయిక. అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో.. పాన్ యూనివర్స్ చిత్రంగా దీన్ని ముస్తాబు చేయనున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం.. అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ముఖాముఖిలో స్పందించారు. ‘‘గ్యాప్ రావడం మా మంచికే అనిపిస్తోంది. మేం ముందే అన్నట్లు ప్రపంచ స్థాయి సినిమాని తీర్చిదిద్దడానికి కావాల్సినంత సమయం దొరికినట్లయింది. ‘ఆదిపురుష్’ రాముడి గురించి కాబట్టి.. ఆ చిత్రం దేశంలోని చిన్న చిన్న పట్టణాలకీ చేరువవుతుంది. ఆ తర్వాత మా సినిమా వస్తే మాకూ మరో 30శాతం రీచ్ పెరిగినట్లే. మా చిత్ర కథ.. స్క్రీన్‌ప్లే.. అందులోని ఆర్ట్ వర్క్.. ప్రతిదీ మరోస్థాయిలో ఉంటాయి. దాన్ని ఎలా చేయాలన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకే కళా దర్శకుడి నుంచి మొదలు.. ప్రతిఒక్క టెక్నీషియన్ మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లుగా నేర్చుకొని మరీ పని చేస్తున్నారు. ఇదీ చిత్ర ఆలస్యానికి ఓ కారణమే. కరోనా వల్ల ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ ఆలస్యమైంది. దీంతో అన్ని ప్రాజెక్ట్‌లు ఆలస్యమయ్యాయి. నిజానికి మేం ఫిబ్రవరి - మార్చిలో చిత్రీకరణ ప్రారంభిద్దాం అనుకున్నాం. ఇప్పుడు జూన్ - జులైలో మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామ’’న్నారు నాగ్ అశ్విన్.
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్