close
Published : 24/02/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊహకందని మలుపులతో...

‘‘సినిమా బడ్జెట్‌ ఎంత? అందులో ఎవరు  నటించారనే విషయాలకంటే ఆ సినిమా పంచే   అనుభూతే ముఖ్యం. ఎలాంటి అంచనాలు లేకుండా ‘ఏప్రిల్‌ 28న ఏం జరిగింది?’ చూశా. నాకు చాలా బాగా నచ్చింది. మంచి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ముందుకొచ్చా’’ అన్నారు యువ కథానాయకుడు నిఖిల్‌. మంగళవారం హైదరాబాద్‌లో ‘ఏప్రిల్‌ 28న ఏం జరిగింది?’ విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. రంజిత్‌, షెర్రీ అగర్వాల్‌ జంటగా... వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘పెద్ద సినిమా చిన్న సినిమా అనే మాటల్ని నేను చాలా యేళ్లుగా వింటున్నా. ఆ మాటలకి అర్థం ఏమిటో నాకు తెలియదు. అనుభూతి పరంగా చూస్తే ఇది చాలా పెద్ద సినిమా అనిపించింది. ఊహకందని మలుపులతో ఆద్యంతం థ్రిల్‌ని పంచింది. కథానాయకుడు రంజిత్‌ నాకు స్నేహితుడు. తన కోసం ఈ సినిమా ఆడాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌, స్క్రీన్‌ప్లే రచయిత హరిప్రసాద్‌ జక్కా, సంగీత దర్శకుడు సందీప్‌కుమార్‌, ఎడిటర్‌ సంతోష్‌, గీత   రచయిత ధర్మతేజ, డ్యాన్స్‌ మాస్టర్‌ భాను, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని