ఉదయ్ శంకర్ హీరోగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్షణ క్షణం’. డా.వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మిస్తున్నారు. జియా శర్మ కథానాయిక. ఈనెల 26న విడుదలవుతోంది. రోషన్ సాలూర్ బాణీలందించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘నేనీ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం శ్రీరామ్ సర్. కొంతమంది వ్యక్తుల్ని కలిస్తే ఎలాంటి గొప్ప అనుభూతి కలుగుతుందో.. ఆయన్ని కలిసినప్పుడు తొలిసారి నాకు అలాంటి అనుభూతే కలిగింది. వారి అబ్బాయి ఉదయ్ నటుడిగా చిత్రసీమలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం చూశా. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింద’’ న్నారు. ‘‘నా దృష్టిలో గెలుపు.. ఓటమికి అసలు అర్థాలే లేవు. ఇక్కడ యుద్ధం మాత్రమే ఉంటుంది. ఆ యుద్ధానికి సిద్ధపడటమే అసలైన గెలుపు. ఉదయ్ ఆ గెలుపుని ఎప్పుడో అందుకున్నాడు. కార్తిక్ ఎంతో చక్కగా తెరకెక్కించారు. జియా శర్మ అచ్చ తెలుగమ్మాయిలాగే కనిపిస్తోంది. మెలోడీ.. బీట్‌ని కలపడంలో సిద్ధహస్తుడు కోటి. ఆ తండ్రిలోని లక్షణాలన్నింటినీ రోషన్ పుణికి పుచ్చుకున్నాడు. నిర్మాత డా.వర్లుని చూస్తుంటే ఓ ఆత్మీయ మిత్రుడ్ని చూస్తున్నట్లుంద’’న్నారు విశిష్ట అతిథి రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘నాకిది మూడో చిత్రం. నిజానికి నేను మరో సినిమా చేయాల్సింది. ఆ చిత్రం కోసం దర్శకుడ్ని వెతుకుతున్న సమయంలో కార్తిక్ తగిలారు. అదే సమయంలో తను నాకొక కథ చెప్పాడు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. నటనకు మంచి ప్రాధాన్యమున్న చిత్రమిది. ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేస్తున్నందుకు అల్లు అరవింద్ సర్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సినిమాల పట్ల ఉదయ్‌కి ఉన్న అభిరుచి చూసి.. ఆయన తండ్రి శ్రీరామ్ సర్‌పై ఉన్న గౌరవంతో నేనీ చిత్రానికి నిర్మాతగా మారా. దీంట్లో ఉన్న సస్పెన్స్ ఎవరూ ఊహించర’’న్నారు నిర్మాత డా.వర్లు. ఈ కార్యక్రమంలో బీవీఎస్ రవి, రామరాజు, బాలాజీ, నిరంజన్, మాధవ్, రఘు కుంచె, ఆకెళ్ల రాఘవేంద్రరావు, గోవింద్, సిద్ధార్థ్, ధర్మతేజ పాల్గొన్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
- ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
- పవన్ భార్యగా సాయిపల్లవి!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
గుసగుసలు
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది