close
Published : 28/02/2021 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నవ్వించడమే లక్ష్యం

‘‘ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే మా ‘జాతిరత్నాలు’ లక్ష్యం’’ అంటున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఆయన నిర్మాణంలో రూపొందిన తొలి చిత్రమిది. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అనుదీప్‌ దర్శకుడు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మార్చి 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈవీవీ, జంధ్యాల సినిమాల్లా ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఈ చిత్రం చేశాం. కథలో భాగంగానే వినోదం ఉంటుంది తప్ప.. ఎక్కడా ప్రత్యేకంగా ఇరికించినట్లు ఉండదు. ఓటీటీ ఆఫర్లు ఎన్నివచ్చినా థియేటర్లో అనుభూతి పంచివ్వాలన్న ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని ఇన్నాళ్లు జాగ్రత్తగా దాచాం. టీంలో అందరూ జాతి రత్నాలే.’’అన్నారు. ‘‘సినీప్రియులకు నవ్వులు పంచడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం’’ అన్నారు అనుదీప్‌. నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘‘నేనిందులో జోగీపేట శ్రీకాంత్‌గా కనిపిస్తా. కథ విన్నప్పుడు ఎంత నవ్వామో.. సినిమా చూస్తున్నంత సేపూ అంతే నవ్వుకున్నామ’’న్నారు. ‘‘ఈ సినిమా చేశాక.. ఇలా కూడా వినోదం పంచొచ్చని అర్థమైంద’’న్నారు ప్రియదర్శి. ‘‘నాకిదే తొలి చిత్రం. ఈ అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలు థ్యాంక్స్‌’’ అంది నాయిక ఫరీయా.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని