close
Published : 28/02/2021 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంధాలు.. భావోద్వేగాలు

‘‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ప్రేమగా కరెక్ట్‌ చేస్తారు. అదేంటో... కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వచ్చేస్తాయి. కోపాలు వచ్చేస్తాయ’’న్న నిజాన్ని విన్న ఓ కుర్రాడు ‘‘నేను కూడా మా నాన్నని కాస్త ఓపిగ్గా ప్రేమగా అడగాల్సింది సార్‌’’ అంటున్నాడు. మరి ఆ తండ్రీ తనయుల కథేమిటో తెలియాలంటే మాత్రం ‘గాలి సంపత్‌’ సినిమా  చూడాల్సిందే. శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్‌ జంటగా రూపొందిన చిత్రమిది. రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్ర పోషించారు. అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతోపాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అనిల్‌ మిత్రుడు, రచయిత ఎస్‌.కృష్ణ షైన్‌ స్క్రీన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.  అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘హాస్యం, భావోద్వేగాలతోపాటు, గొప్ప బంధాల మేళవింపుగా రూపొందిన చిత్రమిద’న్నారు. ‘‘గాలి సంపత్‌ నాకు ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని