close
Published : 02/03/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

థ్రిల్లింగ్‌ ఆట

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా కొండా విజయ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పవర్‌ ప్లే’. మహిదర్‌, దేవేష్‌ నిర్మించారు. హేమల్‌ నాయిక. నటి పూర్ణ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం మార్చి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ టూరిజం ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, కె.కె.రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంద’’న్నారు. ఈ కార్యక్రమంలో హేమల్‌, ప్రిన్స్‌, మధునందన్‌, ఐ.ఆండ్రూ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని