close
Published : 02/03/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘వైల్డ్‌డాగ్‌’.. అందమైన థ్రిల్లర్‌

‘‘తెలుగు ప్రజలందరికీ దగ్గరైన కథతో రూపొందిన చిత్రమే ‘వైల్డ్‌డాగ్‌’. కచ్చితంగా ఈ కథతో ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతార’’న్నారు నాగార్జున. ‘మన్మథుడు 2’ తర్వాత ఆయన నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. ప్రభు సాల్మోన్‌ దర్శకుడు. నిరంజన్‌ రెడ్డి నిర్మాత. సయామీఖేర్‌, దియామిర్జా నాయికలు. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. వాటిని ఆధారం చేసుకునే ప్రభు ఈ కథ సిద్ధం చేశారు. ప్రభు దీన్నొక అందమైన థ్రిలర్‌లా చక్కగా తెరకెక్కించారు. నేనిందులో విజయ్‌ వర్మ అనే ఎన్‌ఐఏ కమాండర్‌గా కనిపిస్తా. నా పాత్రకీ ఓ అధికారి స్ఫూర్తి ఉంది. అదెవరన్నది తెరపై చూడాల్సిందే’’ అన్నారు. ‘‘ఈ సబ్జెక్ట్‌ చూస్తే హిందీలా ఉంటుంది. కానీ, అన్ని వర్గాల వారికీ నచ్చే కొత్తదనమున్న కథ ఇద’’న్నారు దర్శకుడు. కార్యక్రమంలో సయామీ ఖేర్‌, అలిరేజా, రుద్రప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని