close
Published : 02/03/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కామ్రేడ్‌ ‘సిద్ధ’

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 13న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్ధ అనే పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పోరు బాటలో పయనిస్తున్న ఓ యువకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇటీవలే ఈ చిత్రం కోసం రంగంలోకి దిగారు రామ్‌చరణ్‌. ప్రస్తుతం చిరంజీవి, రామ్‌చరణ్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ సామాజిక మాధ్యమాల్లో ఆచార్య ‘సిద్ధ’మవుతున్నాడంటూ రామ్‌చరణ్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఇవి కామ్రేడ్‌ క్షణాలు! ‘ఆచార్య’ సెట్లో నాన్న, కొరటాల శివతో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నా’’ అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రానికి మణిశర్వ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని