close
Published : 04/03/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘జనగణమున...జనం మనిషి రా’

‘వకీల్‌సాబ్‌’ మరో పాటతో అభిమానుల ముందుకువచ్చారు. ‘‘జన..జన..జన.జనగణమున.. కలగలసిన జనం మనిషి రా’’ అంటూ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ పాత్ర తీరును వివరిస్తూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మిస్తుండగా... శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. ‘సత్యమేవ జయతే’ అంటూ శంకర్‌మహదేవన్‌, పృధ్వీచంద్ర ఈ గీతాన్ని ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి రచించారు. హిందీ సినిమా ‘పింక్‌’కు రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’ రూపొందింది. ఇందులో పవన్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుండగా...నివేదా థామస్‌, అంజలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ‘మగువ.మగువ’ పాటను విడుదల చేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘సత్యమేవజయతే’ పాట ఈ చిత్రం నుంచి వచ్చిన రెండోది.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని