close
Published : 04/03/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో అంకం సంపూర్ణం

ల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహు భాషా చిత్రం ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య2’ లాంటి హిట్ల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కొన్ని రోజులుగా తమిళనాడులోని టెన్‌కాశీ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొంటోన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ తాజాగా పూర్తైంది. ఈ మేరకు బృందమంతా హైదరాబాద్‌కు పయనమైంది. ఈ షెడ్యూలులో అల్లు అర్జున్‌, రష్మికలపై కుటుంబ నేపథ్య సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌, ఓ పాట చిత్రీకరించారు. ‘‘ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంగా సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో బన్ని.. పుష్పరాజ్‌ అనే పాత్రలో కనిపించనుండగా.. రష్మిక ఓ పల్లెటూరి యువతిగా కనిపించనుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని