ఆరు నెలలు హాకీలో శిక్షణ తీసుకున్నా
‘‘నటన.. నిర్మాణం.. రెండింటినీ నేను ఆస్వాదిస్తా. ఒకేసారి రెండు పనులు చేస్తున్నప్పుడు భయంకరమైన ఒత్తిడి.. కష్టం ఉంటాయి. ఇలా కష్టపడే అవకాశం మళ్లీ రాదు కదా. అందుకే ఈ ప్రయాణాన్ని ఎంతో ఇష్టంగా కొనసాగిస్తున్నా’’ అన్నారు హీరో సందీప్ కిషన్. ఇప్పుడాయన నుంచి వస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెనీస్ జీవన్ కనుకొలను దర్శకుడు. లావణ్య త్రిపాఠి కథానాయిక. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ నామా, దయా పన్నెం, సందీప్ కిషన్ నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సందీప్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘‘నా కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. ‘నా తర్వాతి సినిమా కొత్తగా ప్రయత్నించాలి.. దానితోనే మంచి హిట్ అందుకోవాలి’ అనుకున్న సమయంలో తమిళంలో ‘నట్పే తునై’ చిత్రం చూశా. చూడగానే అందులోని కథా బలం నన్ను బాగా ఆకర్షించింది. అందుకే దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రీన్‌ప్లేలో చాలా మార్పులు చేశాం. ఇది నాకు తొలి క్రీడా నేపథ్య చిత్రం’’.
* ‘‘నా దృష్టిలో ఇదొక న్యూఏజ్ మోడ్రన్ కమర్షియల్ చిత్రం. కథ ప్రధానంగా ఓ గ్రౌండ్ చుట్టూ తిరుగుతుంటుంది. మంచి పాటలు, అదరగొట్టే యాక్షన్ సీక్వెన్స్, ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు అందరినీ కట్టిపడేసే ఆటలోని భావోద్వేగాలు ఈ చిత్రంలో మిళితమై ఉంటాయి. ఇందులో మేం చెప్పదలచుకున్నది ఏంటంటే.. ‘ఏ రంగంలోనైనా సరే.. ఒక ప్రతిభకు, ఓ కష్టానికీ దక్కాల్సిన విలువ.. గౌరవాలు సరిగా దక్కడం లేద’ని. విజయం వచ్చినప్పుడే ఆ కష్టాన్ని గుర్తిస్తున్నారు తప్ప మిగతా సందర్భాల్లో పట్టించుకోవడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే విషయాన్ని దీంట్లో చర్చించాం. దీంతో పాటు ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్న ఓ సమస్యను ఈ సినిమాలో చర్చించనున్నాం.’’.
* ‘‘ఈ చిత్రం కోసం ఆరు నెలలు హాకీలో శిక్షణ తీసుకున్నా. 16 కిలోలు బరువు తగ్గి.. సిక్స్‌ప్యాక్ లుక్‌లోకి మారా. లైవ్ మ్యాచ్‌లు చూసి ఆటగాళ్ల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయో? తెలుసుకున్నా. ఆట ఆడే క్రమంలో చేతులకి చాలా దెబ్బలు తగిలాయి. ఈ చిత్రం క్లైమాక్స్ మొహాలీ స్టేడియంలో చిత్రీకరించాం. ఈ సినిమా కోసం అండర్ - 19లో ఆడిన నిజమైన హాకీ ఆటగాళ్లు 8మందిని తీసుకొచ్చాం. వాళ్లు ఒక్కరోజుకు రూ.5వేలు తీసుకున్నారట. తర్వాత ఆ విషయం తెలిసి అంత తక్కువ తీసుకున్నారా? అని షాకయ్యా. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ల పరిస్థితి ఎలా ఉందనేది’’.
* ‘‘నేను ప్రస్తుతం జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘రౌడీ బేబీ’ చిత్రం చేస్తున్నా. ‘వివాహ భోజనంబు’లో ఓ కీలక పాత్రలో నటించా. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. మహేష్ కోనేరు నిర్మాణంలో వేద వ్యాస్ అనే దర్శకుడితో ఓ సినిమా చేయనున్నా. దాని తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఓ చిత్రం చేయాలి’’.
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్