close
Published : 04/03/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

25ఏళ్ల కుర్రాడు.. 60ఏళ్ల భార్య

పార్వతీశం కథానాయకుడిగా చైతన్య కొండ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సావిత్రి వైఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి’. గోగుల నరేంద్ర నిర్మాత. నటి శ్రీలక్ష్మి హీరో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘25ఏళ్ల కుర్రాడికి 60ఏళ్ల ఆవిడ భార్య ఎలా అయింది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. కుటుంబ సమేతంగా చూసి, హాయిగా నవ్వుకోవచ్చు. ఈ కథకు పార్వతీశం అయితేనే బాగుంటాడనిపించి ఈ సినిమాకి తీసుకున్నాం. అతని కుమారులుగా శివారెడ్డి, సునీల్‌ శెట్టి కనిపిస్తారు’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన మేనరిజమ్స్‌తో ఎన్నో వెరైటీ పాత్రలు చేశాను. చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి విభిన్నమైన పాత్ర దక్కింది’’ అన్నారు నటి శ్రీలక్ష్మి. పార్వతీశం మాట్లాడుతూ.. ‘‘కేరింత’తో నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అంతకన్నా గొప్ప పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌లో 25రోజులు, ఇతర ప్రాంతాల్లో 20రోజులు చిత్రీకరణ జరుపుతామ’’న్నారు నిర్మాత.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని