close
Published : 06/03/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్మశానంలో ఇచ్చే చోటేదో.. మనసులో ఇయ్యొచ్చుగా

‘‘అమ్మాయిలకెట్టా ఎదవలే నచ్చుతారంటగా.. అందులో నేను నంబర్‌ వన్‌ అయినప్పుడు నన్ను మించిన ఆప్షన్‌ ఏముంటది’’ అంటున్నారు బస్తీ బాలరాజు. ఇప్పుడీ పాత్రలో కార్తికేయ నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. లావణ్య త్రిపాఠి కథానాయిక. బన్నీ వాసు నిర్మించారు. మార్చి 19న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘ఎవరొచ్చినా పర్లేదండి.. ఎత్తుకెళ్లిపోతాం.. అంతిమయాత్రకి’’ అంటూ బస్తీ బాలరాజుగా కార్తికేయ చెప్పే సంభాషణలతో ట్రైలర్‌ మొదలైంది. ఆయనిందులో శవాల్ని తీసుకెళ్లే వ్యాన్‌ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్రకి తగ్గట్లుగానే ఆయన లుక్‌, పలికే సంభాషణలు ఉన్నాయి. లావణ్య త్రిపాఠి ఓ వితంతువు పాత్రలో కనిపించింది. ట్రైలర్‌లోని ఓ సీన్‌లో ‘‘నువ్విలాగే వెంటపడితే మా ఆయన సమాధి పక్కన నిన్నూ పడుకోబెట్టి పాతి పెడతా’’ అని లావణ్య సీరియస్‌గా వార్నింగ్‌ ఇస్తుంటే.. ‘‘ఆ శ్మశానంలో ఇచ్చే చోటేదో నీ మనసులో ఇయ్యొచ్చుగా’’ అని కార్తికేయ బదులివ్వడం నవ్వులు పూయించింది. దీనికి సంగీతం: జేక్స్‌ బిజాయ్‌, ఛాయాగ్రహణం: కరమ్‌ ఛావ్లా.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని