close
Published : 09/03/2021 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళా శక్తికి.. రెడ్‌ సెల్యూట్‌

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్‌, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఓ ప్రత్యేక టీజర్‌ విడుదల చేశారు. దీనికి రానా వాయిస్‌ ఓవర్‌ అందించారు. ‘‘చరిత్రలో దాగిన కథలకు తెర లేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహా సంక్షోభమే గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం ఆమెది. అడవి బాట పట్టిన అనేక మంది వీర తల్లులకు వీళ్లు ప్రతి రూపాలు. వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం. రెడ్‌ సెల్యూట్‌ ఆల్‌ ది గ్లోరియస్‌ విమెన్‌’’ అంటూ టీజర్‌తో సినిమాలోని మహిళా శక్తిని పరిచయం చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. ఏప్రిల్‌ 30న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాకి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: డానీసాంచెజ్‌ లోపెజ్‌, దివాకర్‌ మణి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని