‘వైల్డ్‌డాగ్‌’ వేట షురూ
close
Published : 13/03/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైల్డ్‌డాగ్‌’ వేట షురూ

‘‘ఒకడు మన దేశంలో వందల మంది అమాయకుల్ని చంపి ‘మీరేమీ చేయలేరు అంటే’.. నేను చూస్తూ ఊరుకోలేను’’ అంటున్నారు నాగార్జున. ఇప్పుడాయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకుడు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. సయామీ ఖేర్‌, దియా మీర్జా నాయికలు. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శుక్రవారం హీరో చిరంజీవి చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ‘‘నా సోదరుడు నాగ్‌ ఇందులో ఎప్పటిలాగే చాలా కూల్‌గా.. ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఏ జానర్‌ చిత్రం చేయడానికైనా భయం లేకుండా ముందడుగేసే నటుడు ఆయన. ఈ చిత్ర బృందానికి, మా నిర్మాత నిరంజన్‌ రెడ్డికి శుభాకాంక్షలు’’ అన్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనల్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రమిది. ఆ పేలుళ్లకు పాల్పడిన సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించడానికి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఓ ఆపరేషన్‌ నిర్వహిస్తుంది. ఇందుకోసం ‘వైల్‌్్డడాగ్‌’ టీంని రంగంలోకి దింపుతుంది. మరి ఈ బృందం ఆ విద్రోహ శక్తుల్ని ఎలా మట్టుబెట్టింది? ఈ క్రమంలో వాళ్లు చేసిన సాహసాలేంటి? అన్నది మిగిలిన చిత్ర కథ. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ ఏజెంట్‌ విజయ్‌ వర్మగా కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆద్యంతం ఆయన యాక్షన్‌ హంగామానే కనిపించింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని