ఇదో భిన్నమైన ప్రేమకథ
close
Updated : 14/03/2021 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదో భిన్నమైన ప్రేమకథ

మంచి కథల్లో..  గ్లామర్‌ పాత్రలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే అంటోంది సురభి. ఇటీవల ఆది సాయికుమార్‌తో కలిసి ‘శశి’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సురభి శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ‘‘గారాబంగా పెరిగిన ఓ అమ్మాయి పాత్రలో నేను కనిపిస్తా. నిజ జీవితంలో నా తల్లిదండ్రులకి నేను ఒక్కతినే కూతురిని. ఈ సినిమాలోనూ నా పాత్ర అలాంటిదే. అందుకే దర్శకుడు కథ చెప్పగానే ఆ విషయానికి బాగా కనెక్ట్‌ అయ్యా.  ఇది ప్రేమకథే కానీ, ఇది భిన్నం. గాఢతతో కూడిన కథ, కథనాలు ఇందులో ఉంటాయి. ఆది లుక్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. నేను నటనకి ప్రాధాన్యమున్న పాత్రని చేశా. నా పాత్రలో మరో కోణమూ ఉంటుంది. అదేంటన్నది తెరపైనే చూడాలి. మా ట్రైలర్‌ని చూసి పవన్‌కల్యాణ్‌ సర్‌ మెచ్చుకున్నారు. ‘కొన్ని సినిమాలు చేసేటప్పుడే ఓ తీయటి అనుభూతిని పంచుతాయి. ‘శశి’ అలాంటి అనుభవాన్నే ఇచ్చింది.’’ చింది. ఆ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సురభి శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ‘‘గారాబంగా పెరిగిన ఓ అమ్మాయి పాత్రలో నేను కనిపిస్తా. నిజ జీవితంలో నా తల్లిదండ్రులకి నేను ఒక్కతినే కూతురిని. ఈ సినిమాలోనూ నా పాత్ర అలాంటిదే. అందుకే దర్శకుడు కథ చెప్పగానే ఆ విషయానికి బాగా కనెక్ట్‌ అయ్యా.  ఇది ప్రేమకథే కానీ, ఇది భిన్నం. గాఢతతో కూడిన కథ, కథనాలు ఇందులో ఉంటాయి. ఆది లుక్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. నేను నటనకి ప్రాధాన్యమున్న పాత్రని చేశా. నా పాత్రలో మరో కోణమూ ఉంటుంది. అదేంటన్నది తెరపైనే చూడాలి. మా ట్రైలర్‌ని చూసి పవన్‌కల్యాణ్‌ సర్‌ మెచ్చుకున్నారు. ‘కొన్ని సినిమాలు చేసేటప్పుడే ఓ తీయటి అనుభూతిని పంచుతాయి. ‘శశి’ అలాంటి అనుభవాన్నే ఇచ్చింది.’’Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని