సుకుమార్ ఏం ఇచ్చినా గుర్తుండిపోతుంది
‘‘తగ్గేదే లే... అనే మాట సినిమాలో నా పాత్ర వాడే పదం. నేను వ్యక్తి గతంగా ఎప్పటికప్పుడు చెప్పుకొనే ఒక మాట అది. అందరిలాగే నాకూ భయాలుంటాయి. అప్పుడు ధైర్యం చేసి ముందడుగు వేసేయ్, పరాజయం ఎదురైనా పర్వాలేదు అని చెప్పుకుంటుంటా. అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం రాగలిగా’’ అన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై నిర్మిస్తున్నారు. గురువారం అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ‘పుష్ప’ పాత్ర పరిచయ టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. తగ్గేదే లే... అంటూ అల్లు అర్జున్ అందులో చేసిన సందడి అలరిస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం. ‘పుష్ప’ టీజర్ వచ్చింది. ‘ఐకాన్ స్టార్’ అని ఓ కొత్త పేరు వచ్చింది. అప్పుడు ‘ఆర్య’ ఇచ్చినందుకు, ఇప్పుడు కొత్త పేరు ఇచ్చినందుకు సుకుమార్‌కి కృతజ్ఞతలు. సుకుమార్ నాకు ఏం ఇచ్చినా గుర్తుండిపోయేలా ఉంటుంది. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ పెద్ద పరిశ్రమగా అవతరిస్తుంది. దేవిశ్రీప్రసాద్, నేను, సుకుమార్ కలిసి చాలా రోజుల తర్వాత కలిశాం. పాటల పరంగా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటుంది సినిమా. నా పుట్టినరోజుని పురస్కరించుకుని చాలా మంది అభిమానులు చాలా మంచి పనులు చేశారు. అందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ‘‘ఒక సినిమా విజయవంతం కావాలంటే కథ ఎంత ముఖ్యమో... అందులోని మాటలు, సంగీతం, కెమెరా, పోరాటాలు భావోద్వేగాలు అంత ముఖ్యం. అవన్నీ కలగలిపిన సినిమానే ‘పుష్ప’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ ‘‘బన్నీ నుంచి అద్భుతమైన నటనని అందించనున్నాం. ఈ సినిమా తర్వాత బన్నీని ‘పుష్ప’ అని, లేదంటే ఐకానిక్ స్టార్ అని పిలవాలి. మా నిర్మాతలు ఎంతో సహకారం అందించారు. దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్, రసూల్ పోకుట్టి, క్యూబా, రామకృష్ణ... ఇలా చిత్రబృందమంతా చక్కటి సహకారం అందిస్తోంది’’ అన్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘అశోకవనంలో....’ విశ్వక్సేన్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
గుసగుసలు
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
కొత్త పాట గురూ
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్