close
Published : 08/04/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్వరలో... ఈ కలయికలో?

మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో సినిమా ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్నదే. మహేష్‌ కూడా పలుమార్లు త్రివిక్రమ్‌తో తప్పకుండా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. వీరిద్దరి కలయికలో ‘ఖలేజా’ తర్వాత మరో సినిమా రాలేదు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్‌ - త్రివిక్రమ్‌ కొత్త సినిమా గురించి చర్చ ఊపందుకుంది. త్వరలోనే ఈ కలయికలో సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని, కథానాయికగా పూజా హెగ్డే పేరు దాదాపు ఖరారైందనేది ఫిల్మ్‌నగర్‌ వర్గాల మాట. మరి ఆ చిత్రాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళతారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్‌ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక త్రివిక్రమ్‌తో సినిమా కోసం రంగంలోకి దిగుతారేమో చూడాలి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని