close
Published : 12/04/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిజ జీవిత ఘటనలతో...

రవితేజ మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం ఈ వారంలోనే ప్రారంభం కానుంది. తమిళంలో ‘కో2’ తెరకెక్కించడంతోపాటు... అజిత్‌, కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌ తదితర అగ్ర కథానాయకుల చిత్రాలకి రచయితగా పనిచేశారు శరత్‌.  తెలుగువారైన ఆయన నిజ జీవిత సంఘటనల ఆధారంగా... రవితేజ కోసం ఓ కథని సిద్ధం చేసి ఇటీవలే వినిపించారు. అది   నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపేశారు రవితేజ. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకి చోటుంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. శ్యామ్‌ సి.ఎస్‌.స్వరాలు సమకూరుస్తారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేయడానికి ఒప్పుకొన్నారు. ఈ యేడాది ఆరంభంలో ‘క్రాక్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ... వరుస చిత్రాలతో జోరు పెంచారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని