close
Published : 12/04/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగాది రోజున పేరు

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. విజయవంతమైన ఈ  కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ కథానాయికలు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పేరుని ఉగాది రోజున ప్రకటించనున్నట్టు  ప్రకటించారు. పేరుతోపాటు... లుక్‌ కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి. తొలి గర్జన పేరుతో ఇప్పటికే టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. ఓ పాత్రలో ఆయన అఘోరాగా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని