close
Published : 13/04/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కల నెరవేరింది

ల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన యువకుడు ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలోనే మా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ తెరకెక్కిందన్నారు రమణ్‌. ఆయన కథానాయకుడిగా కె.శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేష్‌, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్‌ నాయిక. రమణ్‌ మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచి సినిమాలపై ఆసక్తి. చదువుకునే సమయంలోనే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. వ్యాపారంలోకి అడుగుపెట్టినా నా సినిమా కల నన్ను వెంటాడుతూ వచ్చింది. నా అభిరుచి, తపనే నా కల నెరవేరుస్తూ ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చేయడానికి కారణమైంది. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రం తీయలేదు. పేరు వెనక అసలు అర్థం ఏంటనేది తెరపై చూడాల’’న్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని