close
Published : 13/04/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్‌రాజుకి కరోనా

తెలుగు చిత్ర పరిశ్రమని కరోనా వణికిస్తోంది. వైరస్‌ ఉధృతితో ఇప్పటికే పలు చిత్రాలు వాయిదా పడ్డాయి. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కరోనాతో సతమతమవుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన నిర్మించిన ‘వకీల్‌సాబ్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఆ సినిమా వేడుకకి దిల్‌రాజు హాజరు కాలేకపోయారు. ఆ చిత్రబృందంలో కథానాయిక నివేదా థామస్‌ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆ చిత్ర  కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో గడుపుతున్నారు. చిత్ర పరిశ్రమలో పలు సినీ కార్యాలయాల సిబ్బందికి కరోనా సోకడంతో నిర్మాణాలు కూడా ఆగిపోతున్నాయి. దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్యతోపాటు మరో ఇద్దరు నిర్మాతలకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని