close
Published : 13/04/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మేజర్‌’.. డబ్బు కోసం చేసిన సినిమా కాదు!

‘‘మన సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేయాలి? ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్లని కాపాడమే సైనికుడి పని’’ అంటున్నాడు ‘మేజర్‌’ పాత్రలో అడవి శేష్‌. ఆయన వీర పోరాటం ఎలా సాగిందో తెలియాలంటే ‘మేజర్‌’ చిత్రం చూడాల్సిందే. అడవి శేష్‌ హీరోగా శశికిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తోంది. జులై 2న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. తెలుగు టీజర్‌ని కథానాయకుడు మహేష్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళం టీజర్‌ని పృథ్వీరాజ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ‘‘డబ్బు సంపాదించాలన్న ఆశతో తీసిన చిత్రం కాదిది. ముంబయి దాడుల్లో మేజర్‌ సందీప్‌ అమరుడైనప్పుడు సొంత అన్నయ్యని కోల్పోయినట్టు అనిపించింది. సందీప్‌ జీవిత కథని తెరపై చెప్పాలనిపించింది. హృదయాల్ని తాకే చిత్రం...మేజర్‌. ’’న్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని