బాలకృష్ణ చిత్రం... అఖండ
close
Updated : 14/04/2021 10:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ చిత్రం... అఖండ

‘సింహా’, ‘లెజెండ్‌’ అంటూ శక్తిమంతమైన పేర్లతో సినిమాలు చేశారు బాలకృష్ణ - బోయపాటి శ్రీను. విజయవంతమైన ఆ కలయికలో ముచ్చటగా మూడో చిత్రం సెట్స్‌పైకి వెళ్లగానే పేరు గురించి ఆత్రుతగా ఎదురు చూశారంతా. అందుకు తగ్గట్టుగానే ‘అఖండ’ అనే మరో శక్తిమంతమైన పేరు ఖరారైంది. ఉగాది సందర్భంగా ఆ సినిమా పేరుని ప్రకటించడంతోపాటు...టీజర్‌ని కూడా విడుదల చేశారు. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...’ అనే సంభాషణతో అలరించారు బాలకృష్ణ. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ నటిస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌, సంగీతం: తమన్‌, మాటలు: ఎం.రత్నం, పోరాటాలు: రామ్‌ - లక్ష్మణ్‌.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని