ఆరోగ్య భాగ్యం సైకిలో మార్గం
close
Published : 15/04/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య భాగ్యం సైకిలో మార్గం

ప్రముఖ నటుడు సోనూసూద్‌ సినిమా సెట్‌కి సైకిల్‌పై వెళ్లారు. హైదరాబాద్‌లో తాను బస చేస్తున్న ఓ హోటల్‌ నుంచి, నగర శివార్లలో వేసిన ‘ఆచార్య’ సెట్‌కి సైకిల్‌ తొక్కారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు సోనూసూద్‌. బుధవారం ఉదయం ఆ సెట్‌కి వెళ్లాల్సి రావడంతో దాదాపు 25 కిలోమీటర్లు సైకిల్‌పైనే వెళ్లారు. హైదరాబాద్‌ అందాల్ని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సెట్‌కి వెళ్లడం మంచి అనుభూతినిచ్చిందని సోనూ ‘ఈనాడు సినిమా’తో చెప్పారు. ‘‘ఉదయాన్నే సైకిల్‌ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు, అదొక మంచి వ్యాయామం. ముంబయిలో నేను చాలాసార్లు సైకిల్‌పైనే సెట్‌కి వెళుతుంటా. ఈ రోజు ‘ఆచార్య’ సెట్‌కి అలాగే వచ్చా. సైకిల్‌ ఎక్కితే నాకు స్కూల్‌కి వెళ్లిన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తుంటాయి. సైక్లింగ్‌కి హైదరాబాద్‌ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ఇదొక మంచి మార్గం’’ అన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని