close
Published : 16/04/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామ్‌ చిత్రానికి రాక్‌స్టార్‌

యువ కథానాయకుడు రామ్‌ కొత్త చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెర కెక్కనుంది. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి స్వరకర్తగా రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ ఎంపికయ్యారు. ఆ మేరకు చిత్రబృందం గురువారం ప్రకటించింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. అందుకోసం సన్నాహాలు మొదలయ్యాయి. రామ్‌ శైలి మాస్‌ అంశాలతో రూపొందనున్న చిత్రమిది. లింగుస్వామి తెరకెక్కించిన చిత్రాలు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకున్నాయి. రెండు భాషల్ని లక్ష్యంగా చేసుకుని సినిమా చేయాలని రామ్‌ ఎప్పట్నుంచో భావిస్తున్నారు. ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరనుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని